| ramdantu | posted on 2013-04-19 08:27:43  |
అత్తరు చల్లిన నెత్తురు జల తారులలో
మైల పడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పువ్వులు
ఎందరికో ఈ కౌగిళ్లు, ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు
ఎక్కడ ఎక్కడ ఏవేదం ఇది ఘోరం అన్నదొ
ఏవాదం ఇది నేరం అన్నదొ
ఎక్కడో ఆవేదం ఎక్కడో
******************
పాట ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఎవరు ?
ఇంత మంచి సాహిత్యం అందించిన వేటూరి గారిదా ఈ గొప్పతనం లేక,
సంగీతాన్ని అద్భుతంగ కూర్చిన చెక్రవర్తి గారిదా ఈ గొప్పతనం లేక,
ఇంత ఆద్భుతంగా పాడిన బాల సుబ్రహ్మణ్యం గారిదా ?
నాకు తెలిసినంతవరకూ ఈపాట ఒక త్రివేణి సంగమం.
--------------------------
ఒక అభిమాని
సాయిశివరామ్ దంటు.
|
|